ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాజమహేంద్రవరంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా గోదావరి నదిలో పుష్కర ఘాట్ల వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పనుల గురించి పవన్ కు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి వివరించారు. అనంతరం పుష్కరఘాట్ నుంచి కోటిలింగాల రేవు వరకు పవన్ బోటులో వెళ్లారు. అఖండ గోదావరి ప్రాజెక్టు పనులను పవన్ కు మంత్రి కందుల దుర్గేశ్ వివరించారు. గోదావరిలో కాలుష్య నివారణకు ఘాట్ల వెంట తీసుకోవాల్సిన చర్యలను పవన్ పరిశీలించారు.