ఏపీలో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రస్థాయిలో పెరిగిందని, దాని నుంచి దృష్టి మళ్లించేందుకే సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారనే భయం చంద్రబాబుకు పట్టుకుందని, అందుకే నిరంతరం వైసీపీపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ కుటుంబానికి పులివెందులలో ఎన్నడూ ఓడిపోయిన చరిత్ర లేదని ఆయన గుర్తుచేశారు.