నాగర్‌కర్నూల్ జిల్లాలో గాలి వాన బీభత్సవం సృష్టించింది. పిడుగుపాటుకు ఓ వ్యక్తితో పాటు కాడెద్దులు, 28 గొర్రెలు మృతి చెందాయి. శనివారం సాయంత్రం భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం పిడుగుపాటు కారణంగా భారీ నష్టం వాటిల్లింది. తాడూరు మండలం గోవిందాయి పల్లి గ్రామంలో గొర్రెలు మేపుతున్న కాపరి మల్లయ్య పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నాగర్ కర్నూల్ మండల పరిధిలోని లింగసానిపల్లి గ్రామంలో పిడుగుపాటుకు 28 గొర్రెలు మృతి చెందాయి. వర్షానికి కల్లాలలో నిర్వహించిన మొక్కజొన్న వరి ధాన్యం తడిసి ముద్దయింది.