పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ స్వయంగా రూపొందించిన భారీ ఫుట్‌బాట్ శిల్పాన్ని బీజేపీ ప్రభుత్వం కూల్చివేసింది. కోల్‌కతాలోని ప్రసిద్ధ సాల్ట్ లేక్ స్టేడియానికి గుర్తింపుగా ఉన్న ఈ శిల్పం శనివారం ధ్వంసం కావడం చూసి స్థానికులు నివ్వెరపోయారు.మమతా బెనర్జీ ఆలోచనతో రూపొందించిన ఆ శిల్పాన్ని 2017లో ఫీఫా అండర్-17 ప్రపంచ కప్‌కు ముందు ఏర్పాటు చేశారు. గత టీఎంసీ ప్రభుత్వపు చిహ్నమైన ‘బిస్వా బంగ్లా’ లోగో కూడా కూడా దీనిపై ఉన్నది.