మే 12 నుండి 20, 2026 వరకు జరిగిన ఎంసెట్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ రెస్పాన్స్ షీట్లతో పాటు ఆన్సర్ కీలను అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. APSCHE పోర్టల్లో లింక్ https://cets.apsche.ap.gov.in అందుబాటులో ఉంటుంది. ఆన్సర్ కీ డౌన్లోడ్ చేసుకున్న అభ్యర్థులు, తాత్కాలిక సమాధానాలలో ఏవైనా లోపాలు గుర్తిస్తే, ఆన్లైన్లో అభ్యంతరాలను సమర్పించాల్సి ఉంటుంది. ఇలా అభ్యంతరాలు లేవనెత్తడానికి, రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీని ఉపయోగించి లాగిన్ కావాలని అధికారులు తెలిపారు.