గాంధీ దవాఖానలో వైద్యం వికటించి విద్యార్థిని మృతి చెందింది. ఛాతీ సంబంధిత సమస్యతో గాంధీ మెడికల్ కాలేజ్ బీఎస్సీ సెకండ్ ఇయర్ విద్యార్థిని పల్లవి గౌడ్ హాస్పిటల్లో చేరారు. పల్లవికి మొదటి సర్జరీ విఫలం కావడంతో రెండోసారి వైద్యులు సర్జరీ చేసినట్లు తెలిసింది. రెండవసారి సర్జరీ చేసినా బ్లీడింగ్ ఆగలేదని, డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే తమ కూతురు చనిపోయిందని పల్లవి కుటుంబ సభ్యుల ఆరోపించారు. పల్లవి మృతదేహం అప్పగించడంలేదని ఆవేదన చెందుతున్నారు.