సామాజిక భద్రత పెన్షన్లు తొలగించాల్సి వస్తే అందుకు సహేతుక కారణాలను అధికారులు చెప్పాల్సిందేనని, ఈ మేరకు శ్రీకాకుళం జిలా ఇచ్చాపురంలో ఐదుగురికి పెన్షన్లు తొలగిస్తూ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు రద్దు చేసింది. ఇచ్చాపురంలో పెన్షన్లు తొలగించిన ఐదుగురికి తక్షణం దాన్ని పునరుద్ధరించడంతో పాటు బకాయిలను సైతం 12 వారాల్లో చెల్లించాలని ఎంపీడీవోకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. విచారణలో పెన్షనర్లు గ్రామంలో లేరనే కారణం చూపుతూ పెన్షన్లు రద్దు చేసినట్లు గుర్తించారు. ఆధార్ వివరాలను బట్టి చూస్తే వారు కొంతకాలంగా ఏపీలోనే ఉంటున్నట్లు హైకోర్టు తెలిపింది.