ఎవరెస్టు సాహసయాత్రికులు విషాదాంతం, ఎవరెస్టు చేరి పతాకం ఎగురేసి తిరిగొస్తుండగా అవరోహణ క్రమంలో మృతి చెందారు. ఈ విషయాన్ని పర్వతారోహకుల సంఘం, స్థానిక అధికారులు శుక్రవారం తెలియచేశారు. చనిపోయిన వారిని అరుణ్ కుమార్, తివారీ , సందీప్ ఆరేగా గుర్తించారు. ఈ ఇద్దరూ వేర్వేరుగా ఎవరెస్టు శిఖరాన్ని బుధ, గురువారాలలో బృందంతో పాటు క్షేమంగా చేరారు. వీరి విజయవంత సాహస యాత్ర లోకానికి తెలిసింది. అయితే తిరుగుముఖం పట్టి, బేస్ క్యాంప్‌నకు చేరే దశలో వీరిద్దరూ శ్వాస ఆడకపోవడం ఇతర సమస్యలతో కుప్పకూలారు.