మేడ్చల్ మల్కాజిగిరి డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ నివాసాల్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు రూ. వందల కోట్ల విలువైన ఆస్తులు గుర్తించారు. శేరిలింగంపల్లి, ఇతర ప్రాంతాల్లో ఆర్డీవోగా పనిచేసిన వంశీమోహన్.. భారీగా ప్రభుత్వ భూములు కాజేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. అబ్దుల్లాపూర్మెట్, పిగ్లీపురంలో 8 ఎకరాలు కాజేసినట్టు ఆరోపణలు ఎదుర్కొన్నారు. భూములను తన మామ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించి.. ఆ తర్వాత రియల్టర్ కు ధారాదత్తం చేసినట్టు అధికారులు గుర్తించారు. ఓ రియల్టర్ నుంచి 10 ప్లాట్లు గిఫ్ట్ డీడ్ చేయించుకున్నట్టు ఏసీబీ గుర్తించింది.