విజయవాడకి చెందిన లింగమనేని రోహిత్..బొల్లా ఓమ్ చిన్నతనం మంచి స్నేహితులు. వీరిద్దరి మధ్య కొంతకాలంగా ఒక యువతి విషయంలో వివాదం మొదలైంది. ఇద్దరు దీనిపై తరచుగా గొడవలు పడేవారు. ఇది కాస్త పీక్స్ కు చేరి నిన్న రాత్రి ఇద్దరు థార్ వహనాలతో పరస్పరం ఢీకొట్టుకుని నానాహంగామా చేశారు. దీంతో ఆ ప్రాంతంలో హైటెన్షన్ నెలకొంది. పోలీసులు అక్కడకు చేరుకొవడంతో రోహిత్ తన జీప్ ను వదిలేసి అక్కడి నుంచి పారిపోయాడు. అక్కడున్న ఒక వాహనంలో యువతి ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.