బెంగళూరుకు చెందిన క్విక్ కామర్స్ స్టార్టప్ జెప్టో త్వరలో భారత స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. దాదాపు రూ.11,000 కోట్ల నిధులను ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) ద్వారా సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. క్విక్ కామర్స్ రంగంలో జెప్టో వ్యూహం ఇతర కంపెనీలతో పోలిస్తే భిన్నంగా ఉందని బ్రోకరేజ్ సంస్థ బెర్న్‌స్టీన్ పేర్కొంది. ప్రస్తుతం జెప్టో దేశవ్యాప్తంగా 61 నగరాల్లో 1,255 డార్క్ స్టోర్లను నిర్వహిస్తోంది. ఒక్కో నగరంలో సగటున 21 స్టోర్ల సాంద్రత ఉండటం కంపెనీ ప్రత్యేకతగా చెబుతున్నారు.