కృష్ణా జిల్లా గుడివాడలోని ప్రసిద్ధ శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో కోటి రూపాయల విలువైన వజ్రసహిత సువర్ణ కిరీటం కిరీటం మాయమైంది.అయితే ఈ కిరీటాన్ని అక్రమంగా తాకట్టు పెట్టినట్లు తెలుస్తోంది. దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ లలిత హుటాహుటిన ఆలయానికి చేరుకుని, అర్చకుల నుంచి వివరాలు సేకరించారు. ఇదిలా ఉంటే దేవుడి వజ్రకిరీటాన్ని తనఖాకు పెట్టుకున్న బంగారం తాకట్టు వ్యాపారి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. తన ఖాతాకు తాకట్టు పెట్టిన డబ్బులు తిరిగి జమ చేస్తేనే తాను నగరానికి వస్తానని తెలిపాడు.