దేశం ఎండ వేడిమితో అట్టుడుకుతోంది. అనేక ప్రాంతాల్లో గతంలో ఎప్పుడూ లేని ఎండలు నమోదవుతున్నాయి. అనేక ప్రాంతాల్లో గరిష్టంగా 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇది అత్యంత ప్రమాదకర స్థాయి. దేశ రాజధాని ఢిల్లీతోపాటు మహారాష్ట్రలోని విదర్భలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు ఈ ఎండ వేడిమికి తట్టుకోలేక అల్లాడిపోతున్నారు. రాబోయే రోజుల్లో ఎండలు మరింత పెరిగి, వడగాల్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.