గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం అత్యంత పారదర్శకంగా క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు.పంచాయతీ భూములు, పోరంబోకు స్థలాలు, స్మశానవాటికలు, పశువుల మేత మైదానాలు పూర్తి వివరాలను నమోదు చేయాలన్నారు. ఈ సర్వే నివేదికలు ఆధారంగా గ్రామాల్లో భూములకు రక్షణ కల్పిస్తామన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో మంగళవారం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. పల్లె పండుగ 1, 2 కార్యక్రమాల ద్వారా గ్రామాల్లో జరుగుతున్న ప్రగతిపై భేటీలో చర్చించారు.