తెలంగాణ పాలనా విభాగానికి జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక ‘ఫేమ్ ఇండియా- షియా పోస్ట్ సర్వే 2026’ దేశవ్యాప్తంగా నిర్వహించిన పరిశోధనలో ఉత్తమ సేవలందించిన టాప్-100 ఐఏఎస్ (IAS) అధికారుల జాబితాను విడుదల చేసింది. ఈ విడతలో తెలంగాణ కేడర్‌కు చెందిన కార్మిక శాఖ కార్యదర్శిగా ఉన్న దాసరి హరిచందన, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి, మరియు మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరిలు ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికయ్యారు.