ఆంధ్రప్రదేశ్‌లో టిప్పర్ లారీల దూకుడు రోజురోజుకీ ప్రజల్లో భయాందోళనలు పెంచుతోంది. అధిక వేగం, ఓవర్‌లోడ్, రూల్స్ పట్టించుకోకుండా రోడ్లపై దూసుకెళ్తు ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఇటీవల కాకినాడ-కొవ్వూరు రహదారిపై జరిగిన ఘోర ప్రమాదంలో ఐదుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది ఇలాంటి పరిస్థితుల్లో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ స్వయంగా రంగంలోకి దిగారు. రహదారిపై వెళ్తున్న టిప్పర్ లారీలను అడ్డుకుని డ్రైవర్లను నడిరోడ్డుపైనే ప్రశ్నించారు. ఇక్కడ ఇష్టారాజ్యంగా వాహనాలు నడిపితే ఊరుకోను అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.