చిత్తూరులో గంగవరంలో ఒక ప్రైవేటు భూమిని అమ్మడం కోసం కలెక్టర్ ప్రకటించినట్లుగా.. ఫేక్ గా చిత్తూరు కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి.. 22ఏ నిషేధిత భూముల జాబితా నుండి భూమి వివరాలు తొలగించినట్టు చూపే ప్రయత్నం చేసారు. ఈ మేరకు కలెక్టర్ ఫేక్ సంతకంతో ప్రొసీడింగ్ ఆర్డర్ తయారు చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కాపీని పంపి పరిశీలించాలని జిల్లా రిజిస్ట్రార్ కోరడంతో అసలు బండారం బయటపడింది. కలెక్టర్ ఆదేశాలతో నకిలీ ప్రొసీడింగ్ కాపీపై గంగవరం పోలీసులకు ఫిర్యాదు చేసారు రెవెన్యూ అధికారులు