తెలంగాణ పోలీస్ శాఖకు గర్వకరమైన క్షణం. కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా మే 18న ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్లో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ పోలీస్ అధికారులను ప్రత్యేకంగా గౌరవించారు. లెఫ్ట్ వింగ్ ఎక్స్‌ట్రీమిజం (ఎల్‌డబ్ల్యూఈ) నిర్మూలనలో తెలంగాణ పోలీస్ చేసిన కృషిని గుర్తించి ఈ గౌరవం అందించారు. తెలంగాణలో గత కొన్ని సంవత్సరాలుగా గ్రేహౌండ్స్ ఫోర్స్ నక్సల్ కార్యకలాపాలను సమర్థవంతంగా అడ్డుకుంది. సమాచార సేకరణ, ఆపరేషన్లు, స్థానికులతో సమన్వయం ద్వారా రాష్ట్రాన్ని నక్సల్-ఫ్రీగా మార్చడం సాధ్యమైంది అని అమిత్ షా వ్యాఖ్యానించారు.