పాస్టర్ ప్రవీణ్ పగడాలలాగే తనను చంపాలని చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు భరోసా పార్టీ అధ్యక్షుడు, పాస్టర్ అభినయ దర్శన్. తనపై దాడి వెనుక కుట్ర ఉందని.. తనపై దాడి వ్యవహారంలో ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజుకి సంబంధం ఉందని అనుకోవడం లేదన్నారు. కొంతమందిపై తనకు అనుమానం ఉందని.. వారి పేర్లు త్వరలోనే బయట పెడతానన్నారు. ఏజెన్సీ గ్రామాల్లో సమస్యల గురించి తెలుసుకుంటున్నానని.. వీటిని అధికారుల దృష్టికి తీసుకెళుతున్నాను అన్నారు. కొద్దిరోజులుగా తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయన్నారు