ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగ యువతకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. వివిధ రిక్రూట్మెంట్ బోర్డుల ద్వారా భర్తీ చేయబోయే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉద్యోగాలకు సంబంధించిన గరిష్ఠ వయోపరిమితిని ప్రభుత్వం 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచుతూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. శారీరక సామర్థ్యం, ప్రత్యేక రక్షణ నిబంధనలు ఉండే పోలీసు, ఎక్సైజ్, ఫైర్, జైళ్లు, అటవీ శాఖల వంటి యూనిఫాం సర్వీసులకు ఈ వయోపరిమితి పెంపు వర్తించదని జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు.