నెల్లూరు జిల్లా తుమ్మలపెంట వేదికగా ‘మత్స్యకారుల సేవ’ కార్యక్రమం జరిగింది. మత్స్యకారుల సేవ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా సిఎం చంద్రబాబు మాట్లాడుతూ..సముద్రంలో వేట నిలిచిపోతే పూట గడిచే పరిస్థితి లేదని, వేట నిషేధ సమయంలో రూ.20 వేలు ఆర్థిక భరోసా ఇస్తున్నామని, 2014-19లో మత్స్య సంపద ఉత్పత్తి 19.18 శాతం పెరిగిందని అన్నారు. తీరం మనదే, బోటు మనదే, వేట కూడా మనదే ఎవరైనా మన తీర ప్రాంతంలోకి వస్తే వేటాడుదాం, వెంటాడుదాం అని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.