ఢిల్లీలోని నార్త్ వెస్ట్ జిల్లా జహంగీర్ పురిలో ఓ వ్యక్తి మంటల్లో కాలిపోతూ ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకు దిగుతున్నాడు. ఇంటి యజమాని మంటలను ఆర్పడానికి ప్రయత్నించాడు. అతడి భార్య మంటలను ఆర్పవద్దని, చనిపోవాలని క్రూరంగా అరిచింది, పోలీసులు అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా అఖరి స్టేట్ మెంట్ ను రికార్డు చేశాడు. తన భార్యకు వివాహేతర సంబంధం ఉండడంతో పలుమార్లు ప్రశ్నించానని, దీంతో భార్య, అత్త, మరో ముగ్గురుతో కలిసి తనపై పెట్రోల్ పోసి తగలబెట్టారని తెలిపాడు. అనంతరం అతడు చికిత్స పొందుతూ చనిపోయాడు