ప్రముఖ సినీ నటుడు విజయ్ నేతృత్వంలో కొత్తగా ఏర్పడిన టీవీకే (TVK) ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చని
డీఎంకే అధినేత, మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ ప్రభుత్వం పూర్తిస్థాయి మద్దతు లేక అస్థిరంగా ఉందని, ఎప్పుడైనా కూలిపోయే అవకాశం ఉన్నందున డీఎంకే శ్రేణులు ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. డీఎంకే కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ..ప్రస్తుత ప్రభుత్వం ఏక్షణమైనా కూలిపోవచ్చుఅని, డీఎంకే పార్టీ కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలన్నారు.