హైదరాబాద్ జలమండలి (HMWSSB) జనరల్ మేనేజర్ కుమార్‌ను లక్ష్యంగా చేసుకుని ఏసీబీ అధికారులు ఇవాళ తెల్లవారుజాము నుంచే సోదాలు చేపట్టారు. బలమైన ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. మల్లాపూర్ నివాసంలో ఏసీబీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. ఇంట్లో నిర్వహించిన సోదాల్లో రూ.1.10 కోట్ల భారీ నగదు, కిలోకు పైగా బంగారు ఆభరణాలను సీజ్ చేశారు. హైదరాబాద్ నగరంలోని ప్రముఖ ప్రాంతాలలో మూడు విలాసవంతమైన ఫ్లాట్లు, అలాగే 6 ఓపెన్ ప్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.