ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు (మే 19) నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంట గ్రామంలో ‘మత్స్యకారుల సేవలో’ (మత్స్యకార భరోసా) కార్యక్రమం ద్వారా మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక సహాయం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అర్హులైన లక్షా 30,796 మత్స్యకార కుటుంబాల ఖాతాల్లో రూ.20,000 చొప్పున మొత్తం రూ.262 కోట్లు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా జమ అయ్యాయి. మత్స్య నిషేధ కాలంలో మత్స్యకారుల కుటుంబాలు ఆదాయం లేక కష్టపడకుండా సహాయం అందించడం లక్ష్యంగా ప్రారంభించినది.