కృత్రిమ మేథ (AI) దూకుడు కారణంగా సాఫ్ట్ వేర్ కంపెనీలు తట్టాబుట్టా సర్దుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడీ తేల్చిచెప్పేశారు. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ధర “దాదాపు సున్నా”కి చేరుకుంటుందని, దాన్ని తయారు చేసే ఉద్యోగాలు రాబోయే కొన్నేళ్లలో మనుగడ సాగించలేకపోవచ్చని పేర్కొన్నారు. లక్షలాది మంది వినియోగదారుల కోసం ఒక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాల్సిన అవసరం అనే భావన తప్పు కావచ్చన్నారు. ఏఐ వల్ల వచ్చే ఈ ఉత్పత్తి ఉప్పెనలో “దశాబ్దాలుగా నిర్మించుకున్న మొత్తం ఉద్యోగాలు, మొత్తం కెరీర్లు” మనుగడ సాధించకపోవచ్చని ఆయన తెలిపారు.