చౌటుప్పల్ కు చెందిన ఉదయ్ అనే యువకుడు ఇబ్రహీంపట్నంలోని ఓ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. తనతో చదువుతున్న యువతిని టీ తాగుదామని కారులో దిల్ సుఖ్ నగర్ తీసుకెళ్లాడు. అనంతరం తిరిగి వస్తుండగా మద్యం కొనుగోలు చేసి బిడిఎల్ రోడ్డులో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి యువతికి బలవంతంగా మద్యం తాగించాడు. అనంతరం యువతిని తన గదిలోనికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. వెంటనే ఆమె ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసింది.