సిరిసిల్లలోని నేతన్న చౌరస్తా వద్ద బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణుల పోటాపోటీ ధర్నాకు దిగాయి. ఈ క్రమంలో పరస్పర నినాదాలతో చౌరస్తా దద్దరిల్లింది. అనంతరం, బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య చెలరేగిన ఘర్షణ కొట్టుకునే స్థాయికి చేరింది. ‘బండి సంజయ్ డౌన్ డౌన్’.. ‘కేటీఆర్ డౌన్ డౌన్’ అంటూ ఇరువర్గాల భారీ నినాదాలు చేశాయి. దీంతో, రంగంలోకి దిగి ఇరు పార్టీల నాయకులను, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసుల లాఠీచార్జ్ చేశారు.