హర్మూజ్ జలసంధి కింద ఉన్న సముద్ర గర్భ కేబుళ్ల కోసం హర్మూజ్ ను వినియోగించుకుంటున్నందుకు గానూ గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ వంటి టెక్ కంపెనీలపై రుసుములు విధించాలని ఇరాన్ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ సంస్థలన్నీ ఇరాన్ చట్టాలకు అనుగుణంగా నడుచుకునేలా, సబ్మెరైన్ కేబుల్ ఆపరేటర్లు లైసెన్సు ఫీజులు చెల్లించేలా కొత్త ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ కొత్త విధానాలు అమల్లోకి వస్తే టెక్ సంస్థలు తమ సముద్ర గర్భ కేబుళ్ల నిర్వహణ, మరమ్మతు హక్కులను కూడా ప్రత్యేకంగా ఇరాన్ కంపెనీలకు అప్పగించాల్సి ఉంటుందట.

