దామరచర్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో టర్బైన్ పరిధిలోని ఆయిల్ పైపులైన్ లీకేజీ కావడంతో భారీ ప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదంలో యంత్రాలు దెబ్బతిన్నాయి. ఆదివారం సెలవుదినం కా వడంతో కార్మికులు ఎక్కువగా లేకపోవడంతో భారీ ప్రాణనష్టం తృటిలో తప్పినట్లయింది. పవర్ ప్లాంట్‌లో 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్షంగా పనులు సాగుతుండగా యూనిట్- 3లో 800 మెగావాట్ల విద్యుత్ సామర్ధం పనులను పూర్తి చేసి విద్యుత్ఉత్పత్తికి సర్వం సిద్ధం చేసిన తరుణంలో ఈ సంఘటన చోటు చేసుకుది.