సాత్విక్ రెడ్డి, చిరాగ్ శెట్టిల జోడీ Thailand Open 2026లో టైటిల్ కు ఒక్క అడుగు దూరంలో ఆగింది. బ్యాంకాక్ లో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో ఇండోనేషియా ద్వయం లియో రోలి కర్నాడూ, డానియల్ మార్టిన్ జోడీ చేతిలో 21-12, 25-23 తేడాతో ఓటమి పాలై రన్నరప్ గా నిలిచింది. 53 నిమిషాల పాటు సాగిన మ్యాచ్లో రెండో గేమ్ చివరి వరకు భారత జోడీ పోరాడినా, టైటిల్ మాత్రం చేజారింది.