ఐదు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ స్వీడన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అక్కడి వైమానిక దళం భారీ రక్షణ కల్పించింది. మోదీ ప్రయాణిస్తున్న విమానం స్వీడన్ గగనతలంలోకి చేరుకోగానే, ఆ దేశంలోని అత్యున్నత రక్షణ విమానాలైన గ్రిపెన్ జెట్స్ ఎస్కార్ట్గా వచ్చాయి. ఈ విమానాలు స్వీడన్ ఫైటర్జె ట్లలో కీలకమైనవి. మోదీ విమానం స్వీడన్లోని గోతెన్బర్గ్ చేరుకునే వరకు ఈ విమానాలు రక్షణగా ఉన్నాయి. ఆదివారం ఆయన స్వీడన్లో అడుగుపెట్టారు.