అమెరికాలో భారతీయ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయారు. నల్గొండ జిల్లా చెరువుగట్టుకు చెందిన జి.శ్రీనివాస్‌రెడ్డి కుమార్తె నవ్య (24) షికాగోలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఉన్నత చదువుల కోసం రెండున్నరేళ్ల క్రితం అమెరికా వెళ్లిన ఆమె.. ప్రస్తుతం పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నారు. ముగ్గురు స్నేహితులతో కలిసి కారులో ఇంటికి వెళ్తున్న క్రమంలో.. వెనక నుంచి దూసుకొచ్చిన మరో కారు ఢీ కొట్టింది. దీంతో నవ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది.