ప్రపంచ దూరప్రసార, సమాచార సొసైటీ దినోత్సవం ప్రతి సంవత్సరం మే 17న నిర్వహించబడుతుంది.
సాంకేతికత (టెక్నాలజీ) ద్వారా వచ్చే అవకాశాలపై అవగాహన పెంచడంకోసం ఈ దినోత్సవం జరుపుకుంటారు.
మొదటిసారిగా మే 17, 1968లో ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవం జరుపుకున్నారు. మే 17న అంతర్జాతీయ టెలిగ్రాఫ్ యూనియన్ స్థాపించారు. అలాగే మొదటి అంతర్జాతీయ టెలిగ్రాఫ్ కన్వెన్షెన్ పై 1865 మే 17న పారిస్‌లో సంతకం చేశారు. అందువల్ల మే 17ను ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవంగా ప్రకటించారు.