పసిఫిక్ మహాసముద్ర ఉపరితలంలో వేగంగా మారుతున్న ఉష్ణోగ్రతలు రాబోయే రోజుల్లో ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. అక్కడ మళ్లీ ఒక శక్తివంతమైన ఎల్ నినో తుఫాను పరిస్థితులు రూపుదిద్దుకుంటున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. పసిఫిక్ మహాసముద్రంలో నీరు సాధారణం కంటే ఎక్కువగా వేడెక్కడం వల్ల తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. దీని ప్రభావంతో ఒకవైపు కరువు పరిస్థితులు మరియు మరోవైపు ఊహించని భారీ వరదలు సంభవించి వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతినే సూచనలు కనిపిస్తున్నాయి.