సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి అఖండ విజయం సాధించిన విజయ్‌కు కమల్ హాసన్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ భేటీ అనంతరం కమల్ హాసన్ స్పందిస్తూ.. విజయ్ దేశంలోనే ఒక పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పటికీ, తన ముందు ఎంతో వినయపూర్వకంగా నడుచుకున్నారని కొనియాడారు. తమిళ సినీ పరిశ్రమ మనుగడకు, అభివృద్ధికి నూతన ప్రభుత్వ మద్దతు ఎంతో అవసరమని పేర్కొంటూ కమల్ హాసన్ సీఎం విజయ్‌కు 6 ముఖ్యమైన డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు.