కాంగ్రెస్ కౌన్సిలర్, మంత్రి జూపల్లి అనుచరుడు ఎండీ ఖాదర్ పాషా పేదల భూమిపై కన్నేసి కబ్జా చేశాడు. తాము ఎంతో కష్టపడి కొన్న భూమిని ఎండీ ఖాదర్ పాషా కబ్జా చేశారు అంటూ బాధితులు మండుటెండలో తమ పసిపిల్లలతో కలిసి అంబేద్కర్ విగ్రహం ఎదురుగా రిలే నిరాహార దీక్ష చేపట్టారు. వెంటనే అక్కడకు చేరుకున్న బాధితులను అరెస్ట్ చేశారు. బాధితుల చంకలో ఉన్న పసిపిల్లలు ఏడుస్తున్నా లెక్కచేయకుండా కర్కశంగా వ్యవహరించిన ఖాకీలు చిన్నారులను కూడా వాహనాల్లో ఎక్కించి తీరుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.