ఫైటర్ జెట్ల తయారీ పరిశ్రమలు పుట్టపర్తికి తెచ్చిన వ్యక్తి సీబీఎన్ అని మంత్రి నారా లోకేశ్ అన్నారు. పుట్టపర్తిలో ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టు శంకుస్థాపన సభలో మంత్రి లోకేశ్ మాట్లాడారు. “1991లో సత్యసాయిబాబా ఎయిర్ పోర్టు నిర్మిస్తుంటే చాలా మంది ఆశ్చర్యపోయారు. ఆయన విజన్ ఇప్పుడు చూస్తున్నాం. డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ వల్లే రాష్ట్రానికి మరిన్ని ప్రయోజనాలు. ప్రధాని మోదీ, రాజ్నాథ్ సింగ్, చంద్రబాబు.. ముగ్గురికీ 75 ఏళ్లు అయినా 25 ఏళ్ల కుర్రాళ్లలా పనిచేస్తున్నారు. అని లోకేశ్ పేర్కొన్నారు.