కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ చేతిలో లైంగిక వేధింపులకు గురైన మైనర్ బాలిక తల్లి కీలక ప్రకటన చేశారు. తన కూతురుపై భగీరథ్ చేసిన అఘాయిత్యం, ఆ సమయంలో తన కూతురు పడిన ఆవేదన, తమకు పోలీస్ స్టేషన్లో ఎదురైన ఇబ్బందులు, బండి సంజయ్ బెదిరింపులు, కావాలనే తన బిడ్డపై చేస్తున్న దుష్ప్రచారం, తమ కుటుంబానికి పొంచి ఉన్న ముప్పు వంటి పలు అంశాలపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.