హైదరాబాద్ నగరంలోని అసిఫ్ నగర్ ప్రాంతంలో ఉన్న ఎం.జే ఫర్నిచర్ గోడౌన్లో ఒక్కసారిగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాద ధాటికి గోడౌన్లో నిల్వ ఉంచిన ఫర్నిచర్ స్టాక్ అంతా అగ్నికి ఆహుతైంది. మంటలు పెద్దఎత్తున ఎగిసిపడుతుండటంతో చుట్టుపక్కల ఉన్న స్థానికులు ప్రాణభయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. జనసాంద్రత ఎక్కువగా ఉన్న నివాస ప్రాంతంలో ఉంది. అక్కడి సందులు చాలా ఇరుగ్గా ఉండటం వల్ల ఫైర్ ఇంజన్లు మంటల వద్దకు చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.