ఢిల్లీలో నిర్భయ ఘటనను తలపించేలా మరో దారుణం చోటుచేసుకుంది. ఉత్తర ఢిల్లీలోని రాణి బాగ్ ప్రాంతంలో మంగోల్‌పురి ఫ్యాక్టరీలో పనిచేసే బాధితురాలు, మే 11 రాత్రి పిఠంపురకు నడుచుకుంటూ వెళ్తోంది. రాత్రి 11 గంటల సమయంలో సరస్వతి విహార్‌లో ఆగి ఉన్న బస్సు వద్ద ఓఇద్దరు వ్యక్తులను సమయం అడగ్గా, ఆమెను బలవంతంగా బస్సులోకి ఎక్కించుకున్నారు. ఈమె ముగ్గురు పిల్లల తల్లి. బస్సులో బలవంతంగా ఎక్కించుకున్న తర్వాత,బస్సు కదులుతుండగానే పలువురు వ్యక్తులు తనపై అత్యాచారం చేశారని బాధితురాలు ఆరోపించింది.

