నైరుతి బంగాళాఖాతం- పశ్చిమ మధ్య బంగాళాఖాతం సమీపంలో సుస్పష్ట అల్పపీడనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇదే ప్రాంతంలో సముద్ర మట్టానికి 5.9 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ, యానాంలో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు, గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముందని తెలిపారు. నైరుతి రుతుపవనాలు ఈనెల 16 నాటికి దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవులను తాకే అవకాశముందన్నారు.

