అమెరికా – చైనా మధ్య వాణిజ్య యుద్ధం, తైవాన్ వివాదం వంటి తీవ్రమైన విభేదాలు కొనసాగుతున్నప్పటికీ, బీజింగ్‌లో షీ జిన్‌పింగ్‌తో జరిగిన ముఖాముఖి భేటీలో ట్రంప్ అత్యంత సానుకూలంగా స్పందించారు. జిన్‌పింగ్‌ను తన ‘మిత్రుడు’ అని సంబోధిస్తూ, ఇరు దేశాల మధ్య గొప్ప భవిష్యత్తు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జిన్‌పింగ్ ఒక శక్తివంతమైన , గొప్ప నాయకుడని, ఆయనతో కలిసి పనిచేయడం తనకు దక్కిన గౌరవమని ట్రంప్ పేర్కొన్నారు

