సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు భారత్ అని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. ఆధ్యాత్మిక, సేవాభావం ముందు వరుసలో ఉంటాయని అన్నారు. బెంగుళూరు లో మోడీ పర్యటించారు. ఆర్ట్ ఆప్ లివింగ్ 45వ వార్షికోత్సవం లో మోడీ పాల్లొన్నారు. కొత్తగా నిర్మించిన ధ్యానమందిరాన్ని ప్రారంభించారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఓ మానవతావాద సంస్థని, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సేవ ప్రతిబింభిస్తుందని, దేశంలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోందని తెలియజేశారు. సమాజశక్తి కలిస్తేనే ఎలాంటి పథకాలైనా విజయవంతం అవుతాయని, అన్ని పనుల్లో సేవ ప్రధానమైనదని మోడీ పేర్కొన్నారు.