టీవీకే విజయ్ రేపు మధ్యాహ్నం 3 గంటలకు తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి .చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో టీవీకే విజయ్ ప్రమాణ స్వీకారంకు ఏర్పాట్లను అధికారులు ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం. విజయ్ టీవీకే పార్టీకి 107, కాంగ్రెస్ 5, వీసీకే 2, సీపీఎం 2, సీపీఐ(ఎం) 2, ఐయూఎంఎల్ 2 మద్దతు తెలిపడంతో సంఖ్యాబలం 120 కి చేరింది. మొత్తంగా టీవీకే విజయ్ ప్రమాణ స్వీకారంపై అధికారిక ప్రకటన వస్తే ఒక క్లారిటీ వస్తుందని చెప్పుకొవచ్చు.