తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు వ్యవహారంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ తీరును ప్రముఖ నటుడు, మక్కళ్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్ తప్పుపట్టారు. ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకపోవడం.. ప్రజాతీర్పును అవమానించడమేనని వ్యాఖ్యానించారు. మెజార్టీని లోక్‌భవన్‌లో కాదని.. అసెంబ్లీలో నిరూపించుకోవాల్సి ఉంటుందన్నారు. తమిళనాడు ప్రజల తీర్పును గవర్నర్ గౌరవించాలని కోరారు.