పశ్చిమ బెంగాల్లో దారుణం చోటుచేసుకుంది. భాజపా కీలక నేత సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) చంద్రనాథ్ రథ్ బుధవారం రాత్రి హత్యకు గురయ్యారు. ఉత్తర 24 పరగణాల జిల్లా మధ్యప్రోగ్రామ్లో సువేందు పీఏ కారులో వెళ్తుండగా దుండగులు కాల్పులు జరపడంతో ఆయన మృతిచెందారు. చంద్రనాధ్ తో పాటు ఉన్న బుద్ధదేవ్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. ఆయన్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

