గుంటూరు నుంచి అమరావతికి వెళ్లే రహదారి గోతులమయంగా మారింది. రోజూ ఉద్యోగులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు, సచివాలయానికి వచ్చే ప్రజలు ఈ రహదారి గుండానే ప్రయాణిస్తుంటారు. ఈ రోడ్డెక్కాలంటేనే గుండెలదురుతున్నాయని వారు చెబుతున్నారు. భారీ గోతులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారి విస్తరణ పనులు ఐదు నెలలు దాటినా పూర్తి కావట్లేదని వాపోతున్నారు. అధికారులు స్పందించి వెంటనే రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయాలని వాహనదారులు కోరుతున్నారు.