తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడిన నేపథ్యంలో దశాబ్దాలుగా ప్రత్యర్థులుగా తలపడుతున్న డీఎంకే, అన్నా డీఎంకే మధ్య పొత్తు చర్చలు
ప్రారంభమైనట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే 59, అన్నాడీఎంకే 47 సీట్లు కైవసం చేసుకున్నాయి . మొత్తం 106సీట్లు. ఇతర చిన్న పార్టీలను కలుపుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి. డీఎంకే, అన్నా డీఎంకే చెరో రెండున్నరేళ్లు పాలించేలా ఒప్పందం కుదిరినట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి.