డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో పనిచేస్తున్న 51 మంది వైద్యులను విధుల నుంచి తొలగించినట్లు మంత్రి తెలిపారు. వీరిలో 8 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 41 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇద్దరు ట్యూటర్లు ఉన్నారని పేర్కొన్నారు. ఏపీ సివిల్ సర్వీసెస్ కండక్ట్ రూల్స్ ప్రకారం ఏడాదికిపైగా విధులకు గైర్హాజరవుతున్న వారిని ఉద్యోగానికి రాజీనామా చేసినట్లుగా పరిగణించి చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని మంత్రి సత్యకుమార్ తెలిపారు.